బిగ్ బాస్ లీక్స్ : ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్!

Sunday, August 19th, 2018, 11:41:00 AM IST

ఇప్పటికే బిగ్ బాస్ షో కు వస్తున్న రెస్పాన్స్ తో నిర్వాహకులు మంచి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొదటి ఎపిసోడ్ తో పోలిస్తే ప్రస్తుతం ఈ షో కు రోజురోజుకు వస్తున్న స్పందన మరియు రేటింగ్స్ చాలా అద్భుతంగా ఉంటున్నాయని, షో ని ఇంత బాగా ఆదరిస్తున్న వీక్షకులకు షో నిర్వాహకులు ధన్యవాధనలు చెపుతున్నారట. ఇక ఆ విషయం అటుంచితే, ఇప్పటికే ఈ వారం షో మరింత ఆసక్తిని రేకెత్తించింది. బిగ్ బాస్, తన హౌస్ లోని కంటెస్టెంట్స్ కు రకరకాల టాస్క్ లు ఇవ్వడం ద్వారా వారి ప్రతిభ మరియు ప్రవర్తనలను తెలుసుకునే ప్రయత్నం చేసారు. ఇక ఈ వారం ఇచ్చిన టాస్కుల్లో సరిగా మరియు ఆక్టివ్ గా పార్టిసిపేట్ చేయకపోవడం, ముఖ్యంగా కాల్ సెంటర్ టాస్క్ లో కౌశల్ పై అనుచిత ప్రవర్తన కారణంగా దీప్తి సునయన పై నెగటివ్ ఇంపాక్ట్ రావడంతో ఆమెపై సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారట.

ఇక ఇప్పటికే ఈ సీజన్ ప్రారంభం నుండి ఏ వారం ఎవరెవరు షో నుండి ఎలిమినేట్ అవుతున్నారు అనేదానిపై బిగ్ బాస్ టీమ్ ఎంత గోప్యతగా వ్యవహరించినప్పటికీ లీకులు మాత్రం ప్రతివారం బయటకి వస్తూనే వున్నాయి. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం షో నుండి ఎలిమినేట్ అయ్యది మరెవరో కాదు దీప్తి సునయన అని సమాచారం. ఇక ఇప్పటికె ఈవారం ఎలిమినేషన్ జోన్ లో వున్న దీప్తి సునయన, పూజ, మరియు రోల్ రైడాలలో దీప్తి సునాయనకే అతి తక్కువ ఓట్లు వచ్చాయని, పలు టాస్కుల్లో ఆమె అంత చురుకుగా పాల్గొనకపోవడం, ఇంకా కాల్ సెంటర్ టాస్కులో ఆమె ప్రవర్తనకు వ్యతిరేకంగా వీక్షకులు ఆమెకు వారిద్దరికంటే తక్కువ ఓట్లు వేసారట. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందొ నేటి రాత్రి షో ముగిసేవరకు వేచిచూడవలసిందే…..