నిమ్మకూరులో బాలయ్య సంక్రాంతి సంబరాలు!

Wednesday, January 14th, 2015, 10:59:03 AM IST


తెలుగుదేశం పార్టీ హిందూపూర్ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ సంక్రాంతి వేడుకలను తన సొంత ఊరు నిమ్మకూరులో ఘనంగా జరుపుకోనున్నారు. కాగా బుధవారం ఉదయం హైదరాబాద్ నుండి విమానంలో గన్నవరం చేరుకున్న బాలయ్య అక్కడినుండి రోడ్డు మార్గంలో నిమ్మకూరు వెళ్లనున్నారు. అటుపై నిమ్మకూరులో జరిగే సంక్రాంతి వేడుకలకు బాలయ్య హాజరవుతారు. ఇక విజయవాడ విమానాశ్రయంలో నందమూరి నటసింహానికి టిడిపి కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తన స్వగ్రామం నారావారి పల్లెలో సంక్రాంతి వేడుకలను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.