బాహుబలి లీక్‌ – దొంగ దొరికాడు

Saturday, January 31st, 2015, 02:04:37 PM IST


డైరెక్టర్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘బాహుబలి షూటింగ్ వీడియో లీక్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. బాహుబలి చిత్రయూనిట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు మకుట విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ నుంచి వీడియో లీకైనట్లు గుర్తించారు. మకుట విజువల్ ఎఫెక్ట్ లో పని చేస్తున్న వర్మ.. పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో వీడియో ఫుటేజీని కాపీ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ దృశ్యాలను వర్మ యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడని పోలీసులు నిర్థారణకు వచ్చారు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఇచ్చిన వీడియోను వర్మ ల్యాప్‌టాప్ ద్వారా యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సప్‌ల్లో ఫ్రెండ్స్ కు షేర్ చేశాడు.

మరోవైపు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన వర్మ మిత్రుడి కోసం గాలింపును చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. 13 నిమిషాల ఫైటింగ్ సీన్లు లీక్ చేసినట్లు గుర్తించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలోంచి 13 నిమిషాల నిడివిగల సన్నివేశాలు లీకవ్వడంతో ఒక్కసారిగా టాలీవుడ్ అవక్కయింది.