రివ్యూ : ఆటగాళ్లు – లాజిక్ లేని క్రైమ్ డ్రామా!

Saturday, August 25th, 2018, 10:10:25 AM IST

కథ:

సిద్దార్థ (నారారోహిత్) ఒక ఫిలిం డైరెక్టర్, అతను అంజలి(దర్శన బానిక్) అనే ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారి కాపురం ఆనందంగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో, అనుకోకుండా అంజలి మర్డర్ చేయబడుతుంది. ఆ విషయంలో సిద్దార్థ్ ని అరెస్ట్ చేస్తారు పోలీసులు, అయితే ఆ కేసు విషయమై ఎంటర్ అయిన క్రిమినల్ లాయర్ వీరభద్ర (జగపతిబాబు) ఆ మర్డర్ మిస్టరీ ని ఎలా ఛేదించాడు. అసలు సిద్దార్థ్ ఆ హత్య చేశాడా లేక మరెవరైనా చేశారా? వీరభద్ర ఆ కేసుని ఏ విధంగా ఛేదించాడు. ఇంతకీ హత్యకు గల కారణమేమిటి, ఆమెను ఎవరు హత్య చేసారు అనేది అసలు కథ..

విశ్లేషణ:

ఇదివరకు పెదబాబు, మరియు ఆంధ్రుడు వంటి ఫ్యామిలీ జానర్ కథలని ఎంచుకున్న దర్శకుడు పరుచూరి మురళి, ప్రస్తుతం తీసిన ఈ ఆటగాళ్లు చిత్రంలో క్రైమ్ డ్రామా అనే మంచి పాయింట్ ని ఎంచుకున్నప్పటికీ, దానిని స్క్రీన్ పై సరిగా ప్రెజెంట్ చేయడంలో మాత్రం చాలావరకు విఫలమయ్యాడనే చెప్పుకోవాలి. కథ మొత్తం పాత మరియు మూస పద్దతిలో సాగుతుండడం ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది. ఇక హీరో నారా రోహిత్ ఆ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. సినిమాలో ప్రధాన ఆకర్షణ అంటే లాయర్ వీరభద్ర పాత్ర, ఆ పాత్రలో జగపతి బాబు స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతమని చెప్పుకోవాలి. ఇక కీలక సన్నివేశాల్లో ఆయనకు మరియు నారా రోహిత్ కు మధ్య జరిగే సంభాషణల్లో జగపతిబాబు నటన చాల బాగుంటుంది. ఇక హీరోయిన్ దర్శన తన పాత్ర పరిధిమేరకు బాగానే నటించి తన అందాలతో మెప్పించింది..

ప్లస్ పాయింట్స్:

జగపతిబాబు స్క్రీన్ ప్రెజన్స్
జగపతిబాబు మరియు నారా రోహిత మధ్య వచ్చే ఘర్షణ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్:

మూసపద్ధతిలో సాగె కథనం
గందరగోళంగా సాగె బ్యాక్ గ్రౌండ్ స్కోర్
లాజిక్ లేని కథ

తీర్పు:

మొత్తంగా చూసుకుంటే, క్రైమ్ జానర్ లో సాగే ఈ ఆటగాళ్లు సినిమా చాలావరకు ప్రేక్షకులను మెప్పించలేదని చెప్పవచ్చు. అయితే జగపతి బాబు స్క్రీన్ ప్రెజన్స్ మరియు ఆయనకు, రోహిత్ కు మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు మాత్రం బాగా ఆకట్టుకుంటాయి. ఎంచుకున్న పాయింట్ ని తెరపై చూపించడంలో విఫలమైన దర్శకుడు పరుచూరి మురళి, సినిమాను ఒక బోరింగ్ సినిమాగా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టారనే చెప్పాలి. చివరిగా ఈ ఆటగాళ్లు చిత్రం చాలావరకు ఒక బీలో యావరేజ్ చిత్రం గా నిలిచే అవకాశం కనపడుతోంది…..

Netiap.com Rating : 2.25/ 5

Reviewed by Netiap Team