నిర్ణయం సరైనదే-బకాయిలు కట్టండి!

Thursday, March 12th, 2015, 09:00:06 PM IST

power
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ ను ఇస్తామన్న తమకు అక్కరలేదని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ట్రాన్స్ కో స్పందించింది. ఈ మేరకు కరెంటు వద్దంటూ కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని ఏపీ ట్రాన్స్ కో స్పష్టం చేసింది. అలాగే కెసిఆర్ తన నిర్ణయాన్ని కేంద్రానికి, ఎస్ఆర్ఎల్ డీసీకి లిఖిత పూర్వకంగా తెలియజేయాలని ట్రాన్స్ కో అధికారులు సూచించారు. ఇక ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయంతో ఆర్ధిక లోటుతో ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్ కు ఎంతో మేలు జరుగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

అలాగే తెలంగాణకు రోజుకు 10మిలియన్ యూనిట్ల విద్యుత్ ను సరఫరా చెయ్యడం వలన తాము బయట నుండి కరెంటును కొనుగోలు చెయ్యాల్సి వస్తోందని ఏపీ ట్రాన్స్ కో అధికారులు పేర్కొన్నారు. ఇక ఇప్పటి వరకు తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్ కోసం 2,744కోట్లకు గాను 504కోట్ల రూపాయాలనే తెలంగాణ సర్కారు చెల్లించిందని ఆరోపిస్తూ,ఇంటర్ కార్పోరేట్ డిపాజిట్ కింద ఈపీడీసీఎల్ కు రావాల్సిన 1200కోట్లను తెలంగాణ ప్రభుత్వం వెంటనే విడుదల చెయ్యాలని ట్రాన్స్ కో అధికారులు విజ్ఞ్యప్తి చేశారు.