ప్లాష్ ప్లాష్: విజయసాయి రెడ్ది పదవికి లైన్ క్లియర్..!

Saturday, July 6th, 2019, 07:51:51 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే తమ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయితే అధికారంలోకి వస్తుందో అదే ప్రభుత్వం నుంచి ఒకరిని ఢిల్లీలో తమ ప్రభుత్వ ప్రతినిధిగా ఎన్నుకోవడం ఆనవాయితీ.

అయితే ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఎంపీ విజయసాయిరెడ్డిని నియమిస్తూ గత నెల 22న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తాజాగా జారీ చేసిన జీవో 68ని ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఎంపీ పదవిలో ఉన్నందున విజయసాయి నియామకాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. అయితే జగన్ ఆ పదవికి విజయసాయి రెడ్డి అయితేనే కరెక్ట్ అని భావించి కొత్త ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవి లాభదాయక పదవుల పరిధిలోకి రాదని చట్టంలో మార్పులు తెస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. అయితే ఈ ఆర్డినెన్స్‌ను తీసుకురావడం వలన ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయి రెడ్డి కొనసాగవచ్చు. అయితే త్వరలోనే ప్రభుత్వం విజయసాయి నియామకంపై మరొ కొత్త జీవోను జారీ చేయనుంది.