అధికారుల పనితీరుపై ఏపీ ప్రత్యేక దృష్టి!

Saturday, January 3rd, 2015, 09:28:08 AM IST

ap-cabinate-meeting
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో శుక్రవారం జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ సమావేశంలో ఏపీ క్యాబినెట్ పలు కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారు. వీటిలో ప్రధానంగా పెండింగ్ లో ఉన్న 41 ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు 7వేల కోట్ల అదనపు నిధులు అవసరమని క్యాబినెట్ నిర్ణయించింది. అలాగే సకాలంలో పనులను పూర్తి చెయ్యకుంటే కాంట్రాక్టర్లపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ఇక విద్యుత్ చార్జీల పెంపుపై చర్చించిన మంత్రివర్గం, అధికారుల పనితీరుపై ప్రజల్లో అవిశ్వాసం ఉందని, దానిని సరిదిద్దాలని నిర్ణయించింది. అలాగే డ్వాక్రా రుణమాఫీకి మహిళా సాధికార కార్పోరేషన్ ను ఏర్పాటు చెయ్యాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇక జనవరి 18వ తేదీన స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ను లాంఛనంగా ప్రారంభించడానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది.