ఏపి కోసం బాబు బిజినెస్ మెన్ అవతారం..?

Monday, January 18th, 2016, 08:46:20 PM IST

chandhra-babu
ఇటీవలే విశాఖలో వాణిజ్యవేత్తల భాగస్వామ్య సమావేశం జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ భాగస్వామ్య సదస్సులో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించింది. మొదటి రెండు రోజులు నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు అంగీకరిస్తే.. చివరిరోజున లక్షకోట్ల రూపాయలకు ఒప్పందాలు జరిగాయి.

ఇక ఇదిలా ఉంటే ఈనెల 20 నుంచి 23 వరకు దావోస్ లో 46 వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరగబోతున్నది. ఇక ఈ ఫోరం సదస్సులో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా పాల్గొంటున్నారు. అయితే, విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ సదస్సుపై దృష్టి సారించింది. మెక్ ఆంధ్రప్రదేశ్ యువర్ బిజినెస్ పేరుతో దావోస్ నగరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ బస్సును ఏర్పాటు చేసింది. ఈ బస్సు ఇప్పుడు అక్కడి ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తున్నది. ప్రపంచంలోని పెట్టుబడిదారుల నుంచి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలియజేస్తూ.. దావోస్ నగరంలో అనేక హోర్డింగులు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బిజినెస్ మెన్ గా మారి పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి