కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ క్యాబినేట్!

Thursday, July 23rd, 2015, 02:00:36 AM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాజమండ్రిలో నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇక ఈ సందర్భంగా మంత్రులు పలు అంశాలపై కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కాగా పుష్కరాలలో బాగా పనిచేసిన వారికి ప్రశంశా పత్రాలను అందజేయాలని, ఆఖరి రోజున పుష్కర జ్యోతిని వెలిగించాలని క్యాబినేట్ నిర్ణయించింది. అలాగే రెవెన్యూ విధానంలో మార్పులు తేవాలని, సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వ శాఖలను విజయవాడకు తరలించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.

ఇక విజయనగరం జిల్లా భోగాపురంలో విమానాశ్రయానికి భూసేకరణపై మరింత చర్చ జరపాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే కర్నూలులో డీఆర్డీఓకు 2వేల ఎకరాల భూమి ఇవ్వాలని, విశాఖ సెజ్ లోని ఈ-సెంట్రిక్ సొల్యూషన్స్ కు 300 ఎకరాలు ఇవ్వాలని క్యాబినేట్ నిర్ణయించింది. ఇక ప్రధాని మోడీ సూచించిన విధంగా కజకిస్థాన్, తుర్కమెనిస్థాన్, ఆస్నాన్, అస్నాబాద్ రాజధానులను పరిశీలించాలని, రాజధాని నిర్మాణ కాంట్రాక్టుల కోసం చైనా, జపాన్, సింగపూర్, మలేషియా దేశాలకు ‘స్విస్ చాలెంజ్’ లో పాల్గొనమని లేఖలు రాయాలని ఏపీ క్యాబినేట్ నేడు సమావేశంలో నిర్ణయించింది.