ఏపీ తాత్కాలిక పాలనా కేంద్రం అదేనట!

Friday, July 31st, 2015, 08:47:43 AM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం విజయవాడలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు చంద్రబాబు నిన్న రాత్రే బెజవాడకు చేరుకున్నారు. ఇక విభజన తర్వాత రాజధాని సైతం లేకుండా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ పాలన అంతా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుండే కొనసాగిస్తున్న నేపధ్యంలో పలు ఇబ్బందులు తలెత్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్ద నున్న మేధా టవర్స్ లో తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేసి శాఖాదిపతుల కార్యాలయాలను అక్కడికి తరలించాలని బాబు నిర్ణయించినట్లు సమాచారం.

అలాగే విజయవాడలో చంద్రబాబు నివాసం కోసం గతంలో నిర్ణయించిన లింగమనేని టవర్స్ లో మంత్రులకు, ఉన్నతాధికారులకు తాత్కాలిక బస ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వం సంకల్పించినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయాలపై నేడు జరగబోయే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే గనుక అమలైతే ఇకపై ఏపీ పాలన విజయవాడ మేధా టవర్స్ నుండే జరగబోతున్నట్లు లెక్క.