ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పై ఉత్కంఠ..!

Monday, March 2nd, 2015, 10:42:51 PM IST


ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 7వ తీదీనుంచి ప్రారంభం కానున్నాయి. ఇక, లక్షకోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. 7వ తేదీన ప్రారంభం అయ్యే ఈ సమావేశాలు 27వ తేదీ వరకు కొనసాగనున్నాయి. 7వ తేదీన ప్రారంభం అయ్యే ఈ సమావేశాలలో అదే రోజున గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం 12వ తేదీన ఏపి సాధారణ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నది. మొన్న కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభావం ఈ బడ్జెట్ పై ఉండే అవకాశం ఉన్నట్టు నిపుణులు తెలియజేస్తున్నారు. సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజు 13వ తేదీన వ్యవసాయ బడ్జెట్ ను అసెంబ్లీ ప్రవేశపెట్టనున్నారు.

ఇక, ఈ బడ్జెట్ లో పన్నులను పెంచే యోచనలో ప్రభుత్వం లేనట్టు తెలుస్తున్నది. లెవీ సేకరణను 25 శాతానికి తగ్గటం, ఆయిల్ ధరలు పెరగడం వలన ఆదాయం తగ్గినట్టు ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ మనత్రి యనమల రామకృష్ణుడు ఈరోజు మీడియాతో తెలిపారు. ప్రణాళికేతర వ్యయాన్ని ఈ బడ్జెట్ లో తగ్గిస్తామని చెప్పారు. కేంద్రం ఇటీవల ప్రకటించిన 850కోట్ల రూపాయల నిధులు విడుదల అయ్యాయని అన్నారు. త్వరలోనే కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు యనమల తెలియజేశారు.