టీడీపీ త‌మ్ముళ్ళ కెళుకుడు.. చంద్ర‌బాబుకు మ‌రో షాక్ త‌ప్ప‌దా.. జంపింగ్ జోన్‌లోకి మ‌రో సిట్టింగ్ నేత‌..?

Thursday, February 28th, 2019, 09:03:06 AM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌కు టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. దీంతో అధికార, ప్ర‌తిప‌క్షాల‌న్నీ ప్ర‌చార వ్యూహాల‌తో పాటు అభ్య‌ర్ధుల ఎంపిక‌లో త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డుతున్నాయి.

ఇక ఎన్నిక‌ల వేళ అధికార తెలుగుదేశం పార్టీకి వ‌రుస షాక్‌లు తగులుతున్నాయి. ఆ పార్టీ నుండి వ‌రుస‌గా కీల‌క‌మైని సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు జంప్ అవుతుంద‌డంతో చంద్ర‌బాబుకు త‌ల‌పోటుగా మారింది.

టిక్కెట్ రాద‌ని భావించిన వారు, పార్టీలో ఒక సామాజిక వ‌ర్గం నుండి త‌ర‌చూ ఎదుర‌వుతున్న అనుమానాలు, ఆయా నేత‌ల్ని పార్టీ మారేలా చేస్తున్నాయ‌ని, వారు చేస్తున్న వ్యాఖ్య‌లు గ‌మ‌నిస్తే అర్ధ‌మ‌వుతోంది.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ప‌శ్చిమ‌గోదావరి జిల్లా కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి జ‌వ‌హ‌ర్‌కు వ్య‌తిరేకంగా టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ర్యాలీలు, నిర్వ‌హించ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

సామాజిక‌వ‌ర్గ స‌మీక‌ర‌ణాల నేప‌ధ్యంలో మంత్రి అయిన జ‌వహ‌ర్‌ను సాగ‌నంపేదుకు చంద్ర‌బాబు అనుకూల వ‌ర్గం తీవ్ర‌స్థాయిలో ర‌చ్చ చేయ‌డం మొద‌లు పెట్టింది.

అయితే మ‌రోవైపు బాబు మెప్పుకోసం ఈ మ‌ధ్య జ‌వ‌హ‌ర్ చేస్తున్న అతి మితిమీరింది. అవ‌కాశం చిక్కిన‌ప్పుడ‌ల్లా వైసీపీ మీద జ‌గ‌న్ మీద తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఇప్పుడు టీడీపీ నేత‌లు ఏకంగా జ‌వ‌హ‌ర్‌కు వ్య‌తిరేకంగా నిన్ను న‌మ్ముతాం బాబు.. మంత్రి జ‌వ‌హ‌ర్‌ను ప‌క్క‌న పెట్టండి అని ప్ల‌కార్డుల‌తో నిర‌స‌న‌లు చేయ‌డం జ‌వ‌హ‌ర్ అండ్ అత‌ని వ‌ర్గం తీవ్ర అసహ‌నంతో ఉంది.

దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌ధ్యంలో జ‌వ‌హ‌ర్‌కు టిక్కెట్ రాకుండా చేయ‌డానికే ఒక సామాజిక వ‌ర్గం కుట్ర ప‌న్నుతుంద‌ని ఆ వ‌ర్గం భావిస్తోంది.

ఈ క్ర‌మంలో త‌న‌కు టిక్కెట్ ద‌క్క‌క‌పోతే ఏం చేయాలి అనే దానిపై త‌న స‌న్నిహితుల‌తో జ‌వ‌హ‌ర్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. దీంతో టీడీపీ నుండి మ‌రో సిట్టింగ్ నేత జంపిగ్ జోన్‌లోకి వ‌చ్చేసినట్టేన‌ని, ఎన్నిక‌ల‌వేళ చంద్ర‌బాబుకు మ‌రో షాక్ త‌ప్పేలా లేద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.