బాలీవుడ్ ట్రెండింగ్ : స‌ర్జిక‌ల్‌స్ట్రైక్ పై మ‌రో సినిమా..?

Tuesday, February 26th, 2019, 05:29:49 PM IST

భార‌త‌దేశం మొత్తం ప్ర‌స్తుతం మాట్లాడుకుంటున్న ఒకే ఒక్క అశం ఏంటంటే పాకిస్తాన్ పై భార‌త్ చేసిన మెరుపు స‌ర్జిక‌ల్ స్ట్రైక్ గురించే. పాక్ ఆర్మీ తేరుకునే లోపే ప‌ని పూర్తి చేశారు మ‌న ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్.

పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దెబ్బకు పది దెబ్బలు కొట్టింది. సర్జికల్ స్ట్రైక్స్ 2 ద్వారా పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్రవాద సంస్థలను కోలుకోలేని దెబ్బ కొట్టాయి.

ఇక పోతే ఈ సర్జికల్ స్ట్రైక్ పై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. రాజ‌కీయ‌నాయ‌కులు, క్రీడాకారులు, సినీ ప్ర‌ముఖులు ఇలా అన్ని రంగాల వారు ఇండియ‌న్ ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు తాజా మ్యాట‌ర్ ఏంటంటే.. భార‌త్ చేసిన తొలి స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌ను యూరీ ద స‌ర్జిక‌ల్ స్ట్రైక్ పేరుతో సినిమాని తెర‌కెక్కించ‌డ‌.. ఆ చిత్రం దాదాపు 200 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే.

దీంతో ఇప్పుడు బాలీవుడ్ ద‌ర్శ‌క, నిర్మాత ఆలోచ‌న ఈ స‌ర్జిక‌ల్-2 పై ప‌డింది. త్వరలోనే ఈ ఘట్టాన్ని కూడా వెండితెరపై ఆవిష్కరించాలని సేమ్ టీమ్ ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం.

ఈ క్ర‌మంలో తొలిభాగం కంటే రెండో భాగాన్ని ఇంకా ప‌క‌డ్బందీగా తెర‌కెక్కించాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్. ఈ మూవీకి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నార‌ని టాక్. మ‌రి పార్ట్ వ‌న్ అదిరిపోగా, పార్ట్‌-2 ఎంలా ఉంటుందో చూడాలి.