నోటుకు ఓటు కేసు.. కీలక మలుపు తిరగనున్నదా..?

Friday, November 27th, 2015, 10:06:05 AM IST


ఈ సంవత్సరం మే నెలాఖరు.. రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ వాతారవణం వేడెక్కిన రోజు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో తెలంగాణ తెలుగుదేశం నేతలు.. నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ 50 లక్షల రూపాయలు ఇస్తూ ఏసీబీకి దొరికిపోయారు. తెలుగుదేశం పార్టీ నేతలైన రేవంత్ రెడ్డి, సండ్ర వీరయ్యలను ఏసీబీ అదుపులోకి తీసుకున్న సంగతి విదితమే. ఆ తరువాత బెయిల్ పై వీరు విడుదలయ్యారు.

అయితే, స్టీఫెన్ సన్ కు లంచం ఇస్తున్నట్టు ఉన్న వీడియో, ఆడియో టేపులలోని వాయిస్ నిర్ధారణ కోసం ఆ టేపులను ఫోర్స్ నిక్ ల్యాబ్ కు పంపిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా, ఆ టేపులలో ఉన్న వాయిస్ వారిదే అని నిర్ధారించింది ఫోర్స్ నిక్ ల్యాబ్. దానికి సంబంధించిన నివేదికను ఏసీబీ అధికారులకు అందజేసింది. అయితే, ఇప్పుడు ఏసీబీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాయిస్ ను కూడా శాంపిల్ గా తీసుకోవాలని భావిస్తున్నది. మరి ఏసీబీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాయిస్ శాంపిల్ ఇచ్చేందుకు అంగీకరిస్తారా.. ఇన్నిరోజులు స్తబ్దతగా ఉన్న నోటుకు ఓటు కేసు వ్యవహారం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేయడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.