రివ్యూ రాజా తీన్‌మార్ : ఆనందో బ్రహ్మ – దెయ్యాల్ని భయపెట్టిన మనుషుల కథ

Friday, August 18th, 2017, 05:28:21 PM IST

తెరపై కనిపించిన వారు : తాప్సి, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్
కెప్టెన్ ఆఫ్ ‘ఆనందో బ్రహ్మ’ : మహి వి రాఘవ్

మూల కథ :
ఎన్నారై రాజీవ్ కనకాల తన తల్లిదండ్రులు చనిపోవడంతో హైదరాబాద్లో ఉన్న తన ఇంటిని అమ్మేయాలనుకుంటాడు. కానీ అందులో దెయ్యాలున్నాయనే ప్రచారం వలన అతను తప్పని పరిస్థితుల్లో తక్కువ ధరకే ఇంటిని అమ్మలసి వస్తుంది. ఇంతలో సిద్దు (శ్రీనివాస్ రెడ్డి) తనకు డబ్బిస్తే ఆ ఇంట్లో దెయ్యాలు లేవని ప్రూవ్ చేస్తానని రాజీవ్ కనకాలతో డీల్ సెట్ చేసుకుంటాడు.

డీల్ ప్రకారం సిద్దు తమతో పాటే డబ్బు అవసరమున్న తులసి (తాగుబోతు రమేష్), రాజు (వెన్నెల కిశోర్), బాబు (షకలక శంకర్) లను కూడా ఆ ఇంట్లోకి తీసుకెళతాడు. అలా ఆ ఇంట్లోకి వెళ్లిన ఆ నలుగురు ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నారు ? ఆ ఇంట్లో ఉన్న దెయ్యాలు ఎవరు ? ఉంటే అవి ఏం చేశాయి ? అసలు రాజీవ్ కనకాల తల్లిదండ్రులు ఎలా చనిపోయారు ? అనేదే తెరపై నడిచే కథ.

విజిల్ పోడు :
–> సినిమా సెకండాఫ్ చాలా బాగుంటుంది. ఇందులో వచ్చే ప్రతి సన్నివేశం బాగా నవ్వించింది. దెయ్యాలు మనుషులకు భయపడే సీన్లు కొత్తగా బాగున్నాయి. దీని వలనే సినిమా సరదా సాగిపోయిన కలిగింది. కనుక దీనికి మొదటి విజిల్ వేసుకోవచ్చు.

–> ఇక కథకు కీలకమైన శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, తాగుబోతు రమేష్, వెన్నెల కిశోర్ ల పాత్రలు చాల బాగా అలరించాయి. దర్శకుడు ఆ పాత్రలకు పెట్టిన వైకల్యాలు, వాటి ద్వారా వాళ్ళు దెయ్యాల్ని భయపెట్టడం అనే అంశాలు భలేగా వర్కవుట్ అయ్యాయి. కాబట్టి వీటికి రెండో విజిల్ వేయొచ్చు.

–> దర్శకుడు మహి వి రాఘవ్ అవసరంలేని అంశాల జోలికిపోకుండా తక్కువ అరుణ్ టైమ్ తో, ఆకట్టుకునే కథనంతో సినిమాని నడిపి సరదగా సినిమా చూసిన భావన కలిగించాడు. కనుక అతనికి మూడో విజుల్ వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :
–> సినిమా ఫస్టాఫ్ కొంత నెమ్మదిగా అనిపించింది. ఆరంభం తప్ప మిగతా అంతా పాత్రల పరిచయానికే వాడేయడంతో పెద్దగా ఆసక్తికరంగా అనిపించలేదు.

–> అలాగే ఇందులో కామెడీ అనే అంశాన్ని బాగా ఎలివేట్ చేశారు కానీ హర్రర్ పాయింట్ ను వదిలేశారు. దీంతో థ్రిల్లింగా అనిపించే సీన్లు ఎక్కడా కనబడలేదు.

ఇందులో ఇంతకూ మించి ఢమ్మాల్ పాయింట్స్ లేవు.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..
సరదగా నవ్వులతో సాగిపోయిన ఈ చిత్రంలో విచిత్రంగా అనిపించే అంశాలేవీ కనబడలేదు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : సినిమా కొత్తగానే ఉంది కదా !
మిస్టర్ బి : అవును.. దెయ్యాలు మనుషులకు భయపడటం కొత్తదే.
మిస్టర్ ఏ: సెకండాఫ్ కామెడీ అయితే భలే ఉందసలు.
మిస్టర్ బి : దెయ్యాల్ని భయపెట్టే ప్రతి సీన్ హాయిగా నవ్వుకోవచ్చు.