తమ్ముడికి తెలియకుండా ఆనం ఆ పని చేస్తున్నారా..?

Sunday, February 19th, 2017, 03:16:51 PM IST


కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు నెల్లూరులో ఆనం సోదరులకు తిరుగు లేదు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జిల్లాలో వారికి తెలియకుండా చీమకుడా ప్రవేశించడం కష్టమని భావిచేవాళ్ళు లేకపోలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు.దీనితో అధికారం చేతులో లేకపోవడంతో ఆనం సోదరులు ఇద్దరో టిడిపిలోకి జంప్ అయిన విషయం తెలిసిందే. కాగా రాజకీయాల్లో ప్రత్యర్థులను కలసి ఎదుర్కొంటూ ముందుకు సాగిన ఆనం సోదరుల మధ్య ఓ ఎమ్మెల్సీ పదవి విషయంలో చిచ్చురేగినట్లు నెల్లూరు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఆనం వివేకానందారెడ్డి.. తన సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డికి తెలియకుండా రహస్యంగా ఎమ్మెల్సీ పదవికోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.కానీ ఆనం వివేకా మాత్రం వాటిని ఖండించారు. తాను ఎమ్మెల్సీ పదవికోసం ప్రయత్నిస్తున్నానన్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు.తాను ఎమ్మెల్సీ పదవి కోసం ముఖ్యమంత్రిని కలవలేదని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తాను వ్యయాన్ని భరించి పోటీచేయలేనని గవర్నర్, ఎమ్మెల్యే కోటాలో వస్తే తీసుకుంటానని పరోక్షంగా వ్యాఖ్యానించడం విశేషం.