ఆనం సోదరుల రూటే సపరేటు..!

Sunday, January 31st, 2016, 06:35:31 AM IST


నెల్లూరు ఆనం బ్రదర్స్ రాజకీయాలు చాలా తమాషాగా ఉంటాయి. ఒకే కుటుంబానికి చెందిన ఈ అన్నదమ్ములలో కొందరు ఒక పార్టీలో ఉంటే మరొకరు వేరే పార్టీలో ఉంటారు. మొత్తానికి వీళ్ళ కుటుంబసభ్యులు కొందరు అధికార పార్టీలోను.. మరికొందరు ప్రధాన ప్రతిపక్షంలోనూ ఉంటారు. తాజాగా ఆనం సోదరుల్లో పెద్దవారైన వివేకా, రామ నారాయణ రెడ్డిలు కొన్నిరోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీని వీడి అధికా టీడీపీలోకి మారారు.

ఇదిలా ఉంటే వీరి సోదరుడైన ఆనం విజయ కుమార్ రెడ్డి మాత్రం ప్రతిపక్ష వైసీపీలోకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే జిల్లా వైసీపీ పెద్దలతో మంతనాలు ముగిశాయని.. త్వరలోనే ఆయన వైసీపీలో చేరుతారని తెలిసింది. దీనిపై తాజాగా ఆయన మాట్లాడుతూ వైసీపీలోకి వెళ్లేందుకు నేను సుముఖంగానే ఉన్నాను. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని, కార్యకర్తలో చర్చించి పార్టీ మారుతానని అన్నారు.