రేసులో భారతీయుడు

Thursday, September 18th, 2014, 05:53:14 PM IST


2016లో అమెరికా అధ్యక్షపదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల రేసులో భారతీయసంతతికి చెందిన లూసియాన గవర్నర్ బాబీ జిందాల్ అధ్యక్ష పదవికి పోటిచేయనున్నట్టు తెలుస్తున్నది. లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ సమర్ధవంతమైన రాజకీయనేతగా మంచి పేరు సంపాదించుకున్నారు. 2016లో జరిగే అధ్యక్షపదవి ఎన్నికకోసం ఇప్పటినుంచే ఆయా పార్టీలు అభ్యర్ధి ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు అమెరికాలో బాబీ జిందాల్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది.