డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ ప్రముఖ దర్శకుడు!

Saturday, March 14th, 2015, 10:26:57 AM IST


హైదరాబాద్ జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ వద్ద జరిగిన తనిఖీలలో ప్రముఖ నృత్య, సినీ దర్శకుడు అమ్మా రాజశేఖర్ మద్యం తాగి కారు నడుపుతూ పట్టుబడ్డారు. ఇక మాదాపూర్ నుండి జూబ్లిహిల్స్ చెక్ పోస్టు మీదుగా బంజారాహిల్స్ వెళుతున్న రాజశేఖర్ ను బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించగా మద్యం తాగినట్లు తేలింది. కాగా ఆయన డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన సమయంలో రాజశేఖర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కారులో ఉండడం గమనార్హం. అలాగే ఆయన నిర్ణీత పరిధి కన్నా అధికంగా మద్యం సేవించినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు రాజశేఖర్ వాహనాన్ని సీజ్ చేసినట్లు సమాచారం.