బిగ్ బ్రేకింగ్ : పాకిస్తాన్‌కు ఊహించిన షాక్..!

Thursday, February 28th, 2019, 12:48:38 PM IST

పుల్వామా ఉగ్ర‌దాడి అనంత‌రం భార‌త్ చేసిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌లో భాగంగా భార‌త్ వాయు ద‌ళం చేసిన మెరుపు దాడి దెబ్బ‌కి ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది పాకిస్తాన్.

అయితే పాకిస్తాన్ ఆ విషయం జీర్ణించుకోక ముందే మ‌రో షాక్ త‌గిలింద‌ని స‌మాచారం. పుల్వామా ఉగ్ర‌దాడి అనంత‌రం ప్ర‌పంచ దేశాల ముందు పాకిస్తాన్‌ను ఒంట‌రి చేయాల‌ని భార‌త్ కంక‌ణం క‌ట్టుకుంది.

ఈ క్ర‌మంలో పాకిస్తాన్‌ను దౌత్య‌ప‌రంగా ఏకాకిని చేయ‌నుకున్న భార‌త్ ప్ర‌య‌త్నాలు క్ర‌మ‌క్ర‌మంగా ఫ‌లిస్తున్నాయి. దీంతో పాకిస్తాన్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది.

పుల్వామా ఉగ్రదాడికి కారణమైన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను నిషేదించాలనే భారత డిమాండ్‌కు అమెరికాతో స‌హా బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు మద్దతు తెలిపాయి.

ఈ నేప‌ధ్యంలో ఈరోజు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జ‌రిగిన పుల్వామా ఉగ్ర‌దాడి విష‌యం పై జ‌రిగిన‌ సమావేశంలో.. వివిధ దేశాలు పుల్వామా ఉగ్రదాడిని ఖండించాయి.

అంతే కాకుండా జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్‌కు చెందిన‌ ఆస్తుల్ని సీజ్ చేయాలని ప‌లు దేశాలు కోరాయి. మసూద్ అజార్ ను గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించాలని అమెరికా డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇక అతడిని విదేశాలకు వెళ్లకుండా నిషేదించాలని.. ఉగ్రవాదులకు నిధులు అందకుండా పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా డిమాండ్ చేసింది. దీంతో పాకిస్తాన్‌కు మ‌రో షాక్ త‌గిలింద‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు