జబాంగ్ ను సొంతం చేసుకున్న అమెజాన్

Friday, November 28th, 2014, 02:42:39 PM IST


ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ జబాంగ్.కామ్ సంస్థను టేక్ ఓవర్ చేసుకోనున్నట్టు తెలుస్తున్నది. ఇందుకోసం 6,000 నుంచి 7,200 కోట్ల రూపాయల వెచ్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. జబాంగ్ ను సొంతం చేసుకునేందుకు తొలిదశ చర్చలను అమెజాన్ పూర్తీ చేసినట్టు తెలుస్తున్నది. ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరి కొనుగోలు పూర్తీ అయితే… భారత్ ఈ కామర్స్ చరిత్రలో ఇదే అతిపెద్ద కొనుగోలు అవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. కాగ, దేశంలో ఫ్లిప్ కార్ట్ మరియు మింత్రాల మధ్య ఒప్పందమే ఇప్పటివరకు పెద్ద ఒప్పందం. అయితే.. రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల విషయంలో మనదేశంలో ఉన్న నిబంధనలు అమెజాన్ కు అడ్డంకిగా మారే అవకాశం ఉన్నది. కాని… ప్రస్తుతం మోడీ ప్రభుత్వం ఈ విషయంలో నిబంధనలు సరళీకృతం చేయాలని చూస్తుండటంతో అమెజాన్ కు లైన్ క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.