తెలంగాణ సీఎస్ తో అమలా అక్కినేని భేటీ!

Wednesday, January 14th, 2015, 11:52:57 AM IST


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ శర్మతో ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున సతీమణి, ప్రముఖ నటి అమలా అక్కినేని మంగళవారం సమావేశం అయ్యారు. కాగా ఈ భేటి దేనికి సంబంధించినదై ఉంటుందన్నవిషయం తెలియరాలేదు. ఇక మంగళవారం సచివాలయానికి వచ్చిన అమల నేరుగా తెలంగాణ చీఫ్ సెక్రటరీ కార్యాలయంలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. కాగా కొద్ది సమయం తర్వాత బయటకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, సీఎస్ రాజీవ్ శర్మలలో ఎవరిని కలిసారని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రాజీవ్ శర్మతో భేటీ అయినట్లు సమాధానం ఇచ్చి, తెలుగువారికి సంక్రాంతి శుభాకంక్షలను తెలియజేసి అమల అక్కినేని అక్కడి నుండి వెళ్ళిపోయారు.