చిరు తరువాత అల్లు అర్జునే అంటున్న టిఅర్ఎస్ ఎంపి..!

Wednesday, March 16th, 2016, 02:30:55 PM IST


సినిమాలు వేరు రాజకీయం వేరు..రెండు వేరు వేరు రంగాలు. ఈ రెండు రంగాలను సపరేట్ గానే చూడాలని.. ఎంపి కవిత ఇటీవలే తన పుట్టిన రోజు సందర్భంగా ఓ ప్రముఖ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాను చిరుకు పెద్ద ఫ్యాన్ అని చెప్పిన కవిత.. చిరంజీవి సినిమాలు అన్నింటిని వదలకుండా చూశానని చెప్పింది. చిరు పాలిటిక్స్ లోకి వచ్చినప్పటికీ.. తన అభిమానం మారలేదని.. చిరుకు తాను ఎప్పటికీ పెద్ద ఫ్యాన్ అని నిజామాబాద్ ఎంపి కవిత పేర్కొన్నది.

చిరంజీవి 150 వ చిత్రం కోసం ఒక అభిమానిగా తాను కూడా ఎదురు చూస్తున్నానని కవిత తెలియజేసింది. చిరు తరువాత అంతటి స్టైలిష్ నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేరని….పవన్ సినిమాలు చూడలేదని చెప్తూనే.. చిరు తరువాత ఆ స్టైల్ కాని, ఆ హుందాతనం అల్లు అర్జున్ లో కనిపిస్తున్నదని కవిత ఇంటర్వ్యూలో పేర్కొన్నది.