ఆల్ టైమ్ టాప్ టెన్ : సూపర్ మాన్ గురించిన కొన్ని నిజాలు

Tuesday, March 15th, 2016, 12:00:43 PM IST


అమాంతం గాలిలోకి ఎగరటం.. విమానాలను సైతం చేతులతో మోసెయ్యడం. ఒక్క దెబ్బతో పెద్ద పెద్ద బండలను సైతం బద్దలు కొట్టెయ్యడం వంటి సాహస కృత్యాలు చేస్తూ.. ప్రపంచ దృష్టిలో ఒక సూపర్ హీరోగా నిలిచిపోయిన వ్యక్తి సూపర్ మాన్. రచయిత జెర్రి సియిగల్ సృష్టించిన అద్బుతమైన పాత్రే ఈ సూపర్ మాన్. పేరు తలుచుకోగానే నీలం రంగు ప్యాంట్ పైన లో దుస్తులు వేసుకుని కళ్ళ ముందు కదులుతాడు సూపర్ మాన్ రూపం. ఇతని గురించి తెలియని వారంటూ ఉండటం అరుదు. ఎవరైనా చిన్న చిన్న సాహసపు పనులు చేస్తుంటే.. ‘ఏరా .. నువ్వేమన్నా సూపర్ మాన్ అనుకుంటున్నావా’ అనేంతగా పాపులర్ మన ఈ హీరో. ఇతని గురించిన కొన్ని నిజాలుఇప్పటికీ చాలా మందికి తెలియదు. ఆ నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. 1938లో ఈ సూపర్ మాన్ పాత్రను సొంతం చేసుకోవడానికి కేవలం $130 మాత్రమే చెల్లించారు.
2. 2006లో విడుదలయిన సూపర్ మాన్ రిటర్న్స్ $200 మిలయన్లను కొల్లగొట్టింది.
3. ఒక టీవీ షోలో సూపర్ శక్తిని పరీక్షించడానికి సూపర్ మాన్ పాత్రదారుడిపై ఒక బాలుడు ఏకంగా తుపాకీనే ఎక్కుపెట్టాడు. అప్పుడు అక్కడి వారు ఆ బుల్లెట్ సూపర్ మాన్ తగిలి రివర్స్ లో వచ్చి ఎవరికైనా తగులుతుందని చెప్పడంతో ఆ బాలుడు గన్ పేల్చలేదు.
4. ప్రపంచంలో శక్తివన్తులెవరో తెలుసుకోడానికి సూపర్ మాన్ పాత్రదారుడు బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీతో రింగులో ఫైట్ కు దిగాడు(కామెడీకే లెండి).
5. మొదట్లో ఈ సూపర్ మాన్ సిరీస్ ను ప్రోడ్యూజ్ చెయ్యడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఇప్పుడు ఈ పాత్రపై వచ్చిన సినిమాలన్నీ మిలియన్ డాలర్లను కురిపిస్తోంది.
6. అప్పట్లో సూపర్ మాన్ పాత్ర అనేది నిజంగానే ఉందని చాలామంది పెద్దలు కూడా నమ్మేయడం విశేషం.
7. సూపర్ మాన్ సూర్యుడి నుండి శక్తిని పొందేవాడట.
8. సూపర్ మొదటగా 1933లో తెరపకోచ్చాడు. అప్పుడు అతనొక విలన్ మాత్రమే. ఆ తరువాత హీరోగా మార్చబడ్డాడు.
9. 1938 ప్రాంతంలో సూపర్ మాన్ కేవలం 800 మీటర్ల దూరం మాత్రమేఎగరగలిగే వాడు. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆగకుండా చుట్టేయగలడు.
10. అప్పట్లో సూపర్ మాన్ పాత్రకు పోటీగా దేవదూత సూపర్ అనబడే చిన్న క్యారెక్టర్ కూడా తెరపైకొచ్చింది. కానీ ఆ తరువాత సూపర్మాన్ దాటికి కనుమరుగైపోయింది.