ఇద్దరి మనసులతో ఆడుకున్నానన్న ఆలియా!

Saturday, February 21st, 2015, 12:20:24 PM IST


ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ ను చూసినవారు ఎవరైనా ఆమె అందానికి ఫిదా అవ్వకుండా ఉండలేరు. ఇక ఈ అందాల రాశి గతంలో ఇద్దరు కుర్రాళ్ళకు మనసిచ్చిందట. కాగా కాలేజీ రోజుల్లో ప్రేమించిన అబ్బాయిని అయితే ఏకంగా పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నదట ఆలియా. అయితే ఏవో మనస్పర్ధలు కారణంగా ప్రేమించిన ఇద్దరికీ తానే హ్యాండ్ ఇచ్చానని ఆలియా భట్ చెబుతోంది. మరి తాను చేసిన తప్పుకు కర్మ ఫలం కూడా అనుభవిస్తానెమోనని ఈ బాలీవుడ్ భామ విపరీతంగా భయపడుతోంది.

ఇక దీనిపై ఆలియా మాట్లాడుతూ తన జీవితంలో తాను ఇద్దరినే ప్రేమించానని, ఏవో మనస్పర్ధలతో ఇద్దరినీ వదిలేసానని చెప్పుకొచ్చారు. అలాగే తాను వాళ్ళ మనసులతో ఆడుకున్నానని, కర్మఫలం అనుభవించడానికి తన మనసుతో కూడా ఎవరైనా ఆడుకుంటారేమోనని భయమేస్తోందని ఆలియా తెలిపింది. ఇక అలా తన జీవితంలో జరగకూడదని, ఎందుకంటే బ్రేక్ అప్ తట్టుకునే శక్తి తన మనసుకు లేదని, కచ్చితంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతానని చెప్తూ తెగ భయపడుతోంది ఈ ముంబై భామ.