‘చిరంజీవి’ తరువాత ‘ప్రభాస్’ ఆ స్టేటస్ కొట్టేశాడు..!

Monday, December 28th, 2015, 04:00:05 PM IST


‘యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్’ స్టేటస్ విషయంలో మరో మెట్టు పైకెక్కేశాడు. ఇప్పటికే బాహుబలి ఘన విజయంతో ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ఇండియన్ సినిమాలో ఇప్పుడో ఐకాన్. సినిమాలో అద్బుతమైన నటన, బ్రంహాండమైన శరీరాకృతి వల్ల ఇప్పటికే ప్రభాస్ కు ఎనలేని క్రేజ్ వచ్చేసింది. ఇవేగాక ప్రభాస్ మహింద్రా XUV 500 వంటి కమర్షియల్ యాడ్స్ లోనూ నటించి సత్తా చాటాడు.

దీంతో ప్రభాస్ కు హై లెవల్ గుర్తింపు, ఫాలోయింగ్ వచ్చాయి. వీటన్నింటికీ తగ్గట్టు ప్రభాస్ కూడా అత్యంత ఖరీదైన, స్టేటస్ కు అసలు సిసలు సింబలైన ‘రోల్స్ రాయిస్ ఫాంతం’ ను కొన్నాడు. అందుకు గుర్తుగా అతని ఫాం హౌస్ లో సన్నిహితులందరికీ పార్టీని కూడా ఇచ్చాడు. ఈ కారు విలువ 8కోట్ల రూపాయలు. ఇందులో అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. ఇప్పటి వరకూ మన టాలీవుడ్ లో ఒక్క ‘మెగాస్టార్ చిరంజీవి’కి మాత్రమే రోల్స్ రాయిస్ ఫాంతం కారు ఉంది. ఇప్పుడు ఆయన తరువాత ప్రభాస్ ఆ గుర్తింపు కొట్టేశాడు.