జనసేనతో ‘సామ్’ జతకడుతోందా?

Monday, April 6th, 2015, 04:42:44 PM IST

samatnha
టాలీవుడ్ ప్రముఖ నటీమణి సమంత కెరీర్ ఇప్పుడు గందరగోళంలో పడినట్లు సినీ వర్గాలు గుసగుసలాడు కుంటున్నాయి. కాగా ఆత్తరింటికి దారేది చిత్రంలో ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న ఈ నటి అటుపై చెప్పుకోదగ్గ విజయాలు లేక వెనకబడింది. ఇక ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేనట్లు సమీపవర్గాలు పేర్కొంటున్నాయి. అయితే సహజంగా మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన సమంతకు సేవా కార్యక్రమాలు చేయడంపై మక్కువ ఎక్కువ. ఇక ఈ మేరకు ఆమె ఒక చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి దాని ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

కాగా సమంత సినీ కెరీర్ ముగుసేలోగా ఆమె రాజకీయాలలోకి అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు సమీప వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో హుద్ హుద్ తుఫాను ఏర్పడినప్పుడు హీరోయిన్ లు అందరికంటే ముందుగా స్పందించిన సమంత స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తన విరాళాన్ని అందజేశారు. ఇక అదే విధంగా ప్రతిపక్షంతో కూడా మైత్రిని కొనసాగిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ సతీమణి భారతితో కూడా ఒక సేవా కార్యక్రమంలో పాలుపంచుకుని కాసేపు ఆమెతో సమంత ముచ్చటించించారు.

ఇక ఇటీవల కాలంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అన్ని వేదికలపై పొగడ్తలు కురిపిస్తున్న సమంత తీరు చూస్తే ఆమె కచ్చితంగా జనసేన పార్టీలో చేరబోతున్నారనే గాసిప్స్ కూడా విపరీతంగా వినిపిస్తున్నాయి. మరి సమంత ఒకవేళ రాజకీయాలలోకి వచ్చే మాటైతే సినీ జీవితంలో విజయం సాధించినట్లే రాజకీయ జీవితంలో కూడా ఎదురులేకుండా ముందుకు వెళుతుందని ఆశిద్దాం.