అర్ధరాత్రి మీడియాపై చిందులేసిన మాజీ ఎంపీ..!

Monday, November 9th, 2015, 09:43:14 AM IST

హైదరాబాద్ లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని బ్రీత్ ఎనలైజ్ చేస్తున్నారు. తాగి వాహనాలు నడపంపై పోలీసులు అవేర్ నెస్ డ్రైవ్ ను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, ఆదివారం అర్ధరాత్రి పోలీసులు హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ రోడ్ నెం 45లో తనిఖీలు చేపట్టారు. అయితే, మాదాపూర్ నుంచి ఫిల్మ్ నగర్ వైపు వెళ్తున్న మాజీ ఎంపీ, సినీనటి జయప్రద కారును పోలీసులు ఆపి బ్రీత్ ఎనలైజ్ చేశారు. డ్రైవర్ మద్యం సేవించలేదని తేలింది.

అయితే, డ్రైవర్ కు మరోమారు టెస్ట్ చేయాలని.. అలా టెస్ట్ చేస్తున్న దృశ్యాలను తాము కెమెరాలో బందిస్తామని చెప్పడంతో.. పోలీసులు అలాగే చేశారు. దీంతో కారులో ఉన్న జయప్రద అసహనం వ్యక్తం చేసింది. వెంటనే కారు దిగి.. మీడియా సిబ్బందిపై చిందులు వేసింది.