నటుడు విజయ్ కాంత్ కు కోర్టు జరిమానా!

Wednesday, February 18th, 2015, 12:01:49 PM IST


ప్రముఖ తమిళ నటుడు, డీఎంకే నేత విజయ్ కాంత్ కు మద్రాసు హైకోర్టు జరిమానా విధించింది. వివరాలలోకి వెళితే పరునష్టం దావా కేసులో కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినందుకు విజయ్ కాంత్ కు మద్రాస్ హైకోర్టు 24వేల రూపాయల జరిమానా విధించింది. కాగా అధికార అన్నా డీఎంకే పార్టీపై తీవ్ర ఆరోపణలు చేసినందుకు రాష్ట్రంలోని పలు జిల్లాలలో విజయ్ కాంత్ పై పరువునష్టం దావాలు నమోదయ్యాయి. ఇక నిరంతర విచారణలపై విసుగు చెందిన డీఎంకే నేతలు పరునష్టం కేసులపై విచారణ ఆపాలని హైకోర్టును ఆశ్రయించారు. అలాగే తాము కేసుపై స్టే తెచ్చుకునేందుకు సుప్రీంకోర్టుకు వెళతామన్న డీఎంకే నేతల విజ్ఞ్యప్తికి హైకోర్టు అనుమతిచ్చింది. కాగా నెల రోజుల సమయం ఇచ్చినా విజయకాంత్ మరియు ఇతర డీఎంకే నేతలు స్టే తేవడంలో నిర్లక్ష్యం వహించడంతో కోర్టు జరిమానా విధించింది.