సెట్స్ పై బాలీవుడ్ నటుడి వీరంగం!

Thursday, February 19th, 2015, 11:31:53 AM IST


ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలీ ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న ‘బాజీరావ్ మస్తానీ’ అనే సినిమా షూటింగ్ లో వీరంగం ఎత్తాడట. అయితే ఇప్పటికే పెద్దగా క్యారెక్టర్లు లేక సతమతమవుతున్న ఆదిత్య మైండ్ సెట్ కూడా కాస్త అవుట్ ఆఫ్ ఆర్డర్లో ఉందని సమీప వర్గాలు గుసగుస లాడుకుంటున్నాయి. ఇక విషయానికి వస్తే ‘బాజీరావ్ మస్తానీ’ సినిమా షూటింగ్ కు లేట్ గా వచ్చిన ఆదిత్య పంచోలీ, వస్తూనే కొంతమంది యూనిట్ సభ్యులపై ధుమధుమలాడుతూ దురుసుగా ప్రవర్తించాడట.

అంతటితో ఆగకుండా మరి కొందరిని పనిచెయ్యకుండా అడ్డుకున్నాడట. ఇక ఈయన గారి వాలకాన్ని చూసిన దర్శకుడు వెంటనే ఆదిత్యని ఇంటికి పంపేసారు. కాగా మరునాటి ఉదయం షూటింగ్ కి వచ్చిన పంచోలీ ఎంతో శాంతంగా కనిపించి, అందరికీ సారీ చెప్పి మరీ పని మొదలెట్టాడని సమాచారం. ఇక ఒకరి మీద కోపం మరొకరి మీద చూపించిన ఆదిత్య పాంచోలీ అనవసరంగా అభాసుపాలై చివరికి తప్పు తెలుసుకున్నాడని సినీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఈ చిత్రంలో రణవీర్ సింగ్, దీపిక పదుకునే హీరో హీరోయిన్ లుగా నటిస్తుండగా ఆదిత్య నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్నారు.