విద్యార్ధులు లేకుండానే.. లక్షల్లో ఖర్చు..!

Friday, January 29th, 2016, 01:05:38 PM IST


ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ ఆదీనంలో నడుస్తున్న హాస్టల్స్ లో జరుగుతున్న అవినీతిని చూస్తుంటే వామ్మో అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని అనేక హాస్టల్స్ లో అవినీతి జరుగుతుందని సమాచారం అందటంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో అనేక విషయాలు వెలుగుచూశాయి. కొన్ని హాస్టల్స్ లో రిజిస్టర్ లో ఉన్న పేర్లకంటే హాస్టల్ లో ఉండే విద్యార్ధుల సంఖ్య తక్కువగా ఉన్నది. దీంతో హాస్టల్ నిర్వాహకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నది ఏసీబీ.

ఇకపొతే, కృష్ణా జిల్లా నందిగామలోని ఓ హాస్టల్ లో జరిగిన అవినీతిని చూస్తే కళ్ళు తిరగాల్సిందే. హాస్టల్ లో ఒక్క విద్యార్ధి కూడా లేడు. కాని, ఖర్చు మాత్రం నెలకు 4 లక్షల రూపాయలను చూపిస్తున్నారు. లెక్కలు చూపించినట్టుగానే ప్రభుత్వం ఫండ్ రిలీజ్ చేస్తున్నది. ఎంతకాలం నుంచి హాస్టల్ లో అవినీతి జరుగుతుంది అనే విషయంపై ఏసీబీ అధికారులు అవినీతి చేపలను ప్రశ్నిస్తున్నారు.