రోడ్డు భద్రతపై బైక్ ర్యాలీని ప్రారంభించిన అభిషేక్ బచ్చన్

Sunday, December 21st, 2014, 01:43:08 PM IST


రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేదుకు ముంబైలో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీని ప్రముఖ బాలివుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల భద్రతపై అందరికీ అవగాహన రావాలని అన్నారు. ఒక్క ముంబైలోనే కాకుండా దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని… రోడ్డు ప్రమాదాలలో ముఖ్యంగా తలకు దేబ్బతగాలటం మూలంగానే ఎక్కువమంది మరణిస్తున్నారని… హెల్మెట్ ధరించకపోవడం మూలంగానే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఒక్క ముంబైనగరంలోనే కాకుండా దేశవ్యాప్తంగా బైక్ మీద ప్రయాణం చేసేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని… హెల్మెట్ ధరించడం వలన చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చునని అన్నారు. బైక్ నడిపేవారు కాకుండా… వెనుక కూర్చున్నవారు కూడా తప్పకుండ హెల్మెట్ ధరించాలని అభిషేక్ బచ్చన్ తెలియజేశారు.