మార్క్ లిస్టు కు ఆధార్ తప్పనిసరి..!

Sunday, February 1st, 2015, 02:58:05 PM IST


ఆధార కార్డ్… ఇప్పుడు ప్రతి దానికి అంటే రేషన్ కార్డుకు, గ్యాస్‌ కు, బ్యాంక్ ఖాతాకు, వాహనాలకు ఇలా ప్రతి మనిషి జీవనానికి సంబంధించి ప్రతీ దానికి ఆధార్ కార్డు తప్పనిసరైంది. అయితే, తాజాగా, ఇప్పుడు ఇంటర్మీడియట్ కు కూడా ఆధార్ కార్డు అవసరం అవుతున్నది. ఇంటర్మీడియట్ మార్కుల లిస్ట్‌ తీసుకోవాలి అంటే ఇకపై ఆధార్ కార్డు కావాల్సిందే. ఆధార్ కార్డ్ లేకపోతే… పరిక్షలు రాసినా మార్క్ లిస్టు అందించే పరిస్థితి కనిపించడం లేదు. 2014-15 విద్యాసంవత్సరంలోనే ప్రతీ విద్యార్థికి ఆధార్ కార్డు ఉండాలని బోర్డు సూచించింది. విద్యార్ధులు కాలేజీలలో చేరే సమయంలోనే దరఖాస్తుతోపాటు ఆధార్ కార్డు కూడా కాలేజీలకు సమర్పించాలని బోర్డు నిబంధన పెట్టింది. దీంతో ఆధార్ కార్డు ఇవ్వని విద్యార్ధులు ఇప్పుడు అయోమయంలో పడిపోయారు.