ఎయిర్ పోర్టుకు నష్టం 500కోట్లు

Tuesday, October 14th, 2014, 02:25:07 PM IST


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుధుద్ సృష్టించిన ప్రళయానికి విశాఖలో పలు సంస్థలకు వాటిల్లిన నష్టాన్ని వివరించారు. ఇక విశాఖ నేవీకి 2వేల కోట్ల నష్టం జరిగిందని, ఉక్కు కార్మగారానికి 340కోట్లు నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇక విశాఖ విమానాశ్రయానికి 500కోట్లు, షిప్పింగ్ హార్బర్ కు వంద కోట్లు నష్టం జరిగిందని బాబు వివరించారు. అలాగే 40వేల కరెంటు స్థంభాలకు భారీ నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఇక ఈ రోజు 1.15గంటలకు ప్రధాని మోడీ విశాఖ వస్తారని, కొన్ని తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి అటుపై విశాఖ ఎయిర్ పోర్ట్ లో సమీక్ష నిర్వహిస్తారని చంద్రబాబు తెలిపారు.