ఆంధ్ర‌ప్రదేశ్ మ‌హాసంగ్రామం : ఫైన‌ల్ వార్ డేట్ పిక్స్ అయ్యిందా..?

Sunday, February 10th, 2019, 12:47:17 PM IST

దేశ‌వ్యాప్తంగా మ‌రో మూడు నెల‌ల్లో ఎన్నిక‌ల శంఖారావం మోగ‌నుండి. ఈ క్ర‌మంలో దేశ వ్యాపంగా లోక్‌స‌భ‌ ఎన్నిక‌లు జ‌రుగునున్న సంగ‌తి తెలిసిందే. అలాగే కొన్ని రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, జమ్ముకాశ్మీర్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను కూడా జ‌రుగ‌నున్నాయి. దీంతో కేంద్రంలో అధికారాన్ని చేప‌ట్ట‌బోయే పార్టీని నిర్ణ‌యించ‌నున్న ఈ లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ కోసం స‌ర్వ‌త్రా ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఎన్నిక‌ల నోటిఫికేషన్ విడుద‌ల చేసేందుకు ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌స‌ర‌త్తు ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజా మ్యాట‌ర్ ఏంటంటే ఈ లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించిన నోటీఫికేషన్ డేట్స్ ఫిక్స్ అయ్యిందని, ఆయా రాష్ట్రాల్లో జ‌రుగ‌నున్న ఈ ఎన్నిక‌ల డేట్స్ కూడా సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం అవుతున్నాయి. ఇక ఆంద్ర‌ప్ర‌దేశ్ విష‌యానికి వ‌స్తే.. లోక్‌స‌భ ఎన్నిక‌ల డేట్ ఏప్రిల్ 30న లేదా మే మొద‌టి వారంలో నిర్వ‌హించాల‌ని, దానికి సంబంధించిన షెడ్యూల్ లిస్ట్‌ను ఎన్నిక‌ల కమీష‌న్ యూనియ‌న్ క్యాబినేట్ అప్రూవ‌ల్ కోసం పంపంద‌ని స‌మాచారం.

ఇక మొత్తం దేశ‌వ్యాప్తంగా ఈ లోక్‌స‌భ ఎన్నిక‌లు డేట్స్ రాష్ట్రాల వారిగా చూస్తే..

* బీహార్ – ఏప్రిల్ 10,17,24,30 అండ్ మే 7,12.

* ఒడిశా – ఏప్రిల్ 10,17

* వెస్ట్ బెంగాల్ – ఏప్రిల్, 17,24,30 అండ్ మే 7,12

* జార్ఖండ్ – ఏప్రిల్, 10,17,24

* ఛ‌త్తీస్‌ఘ‌ర్ – ఏప్రిల్, 10,17,24

* మ‌ధ్య‌ప్ర‌దేశ్ – ఏప్రిల్, 10,17,24

* గోవా – ఏప్రిల్, 17

* గుజ‌రాత్ – ఏప్రిల్, 30

* మ‌హారాష్ట్ర – ఏప్రిల్, 17,24

* రాజ‌స్తాన్ – ఏప్రిల్, 17,24

* హ‌ర్యాణ – ఏప్రిల్, 10

* హిమాచ‌ల్ ప్ర‌దేశ్ – ఏప్రిల్, 17

* జ‌మ్మూ & కాశ్మీర్ – ఏప్రిల్, 10,17,24,30 అండ్ మే 7

* ఉత్త‌రాఖాండ్ – మే, 17

* కర్నాట‌క – ఏప్రిల్, 17

* కేర‌ళ – ఏప్రిల్, 10

* త‌మిళ‌నాడు – ఏప్రిల్, 24

* ఆంద్ర‌ప్ర‌దేశ్ – ఏప్రిల్ 30, May

* మ‌ణిపూర్ – ఏప్రిల్, 9,17

* మేఘాల‌య – ఏప్రిల్, 9

* మిజోరం – ఏప్రిల్, 9

* నాగాలాండ్ – ఏప్రిల్, 9

* అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ – ఏప్రిల్, 9

* అస్సాం – ఏప్రిల్, 7,12,24

* సిక్కిం – సిక్కిం, 12

* త్రిపుర – ఏప్రిల్, 7,12

* అండ‌మాన్ – ఏప్రిల్, 10

* చండీఘ‌ర్/ ప‌ంజాబ్ – ఏప్రిల్, 10

* దాద్రానగర్ హవేలీ – ఏప్రిల్, 30

* ల‌క్ష‌ద్వీప్ – ఏప్రిల్, 10

* ఢిల్లీ – ఏప్రిల్, 10