2.0 మూవీ ట్విట్టర్ రివ్యూ.. శంక‌ర్ ఎలా తీశాడో.. తేల్చిప‌డేశారుగా..?

Thursday, November 29th, 2018, 07:18:00 AM IST

సూపర్ స్టార్ ర‌జినీకాంత్, డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం 2.0. భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం ఈ గురువార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ర‌జినీతో పాటు అక్ష‌య్ కుమార్, అమీ జాక్స‌న్ న‌టించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్ నిర్మించింది. విప‌రీతమైన అంచ‌నాల‌తో రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న ఈ చ‌త్రం ఈ రోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దీంతో ఇప్ప‌టికే ప్రీమియ‌ర్లు కంప్లీట్ అవ‌డంతో, ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్ష‌కులు ట్విట్ట‌ర్ ద్వారా త‌మ అభిప్రాయాన్ని తెల్పుతున్నారు.

2.0 చిత్రంలో చిట్టీ ఎంట్రీ అదిరిపోయిందని.. ఎంతో ఆసక్తిగా శంకర్ సినిమాకోసం ఎదురు చూసిన ప్రేక్షకుల్ని నిరాశ పరచలేదని చెబుతున్నారు. ఇక‌ రజినీకాంత్, అక్షయ్ కుమార్ యాక్టింగ్ చాలా ఏళ్లు గుర్తుండిపోతుందని.. ఏఆర్ రెహమాన్ బ్యాంగ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్ళింద‌ని మ‌రికొంత‌మంది చెబుతున్నారు. క్లైమాక్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉందని, 2.0 చిత్రంతో ఇండియన్ సినిమా హిస్టరీలోనే బెస్ట్ క్లైమాక్స్ ఇచ్చారని ప్రేక్ష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక‌ రోబో సీక్వెన్స్ అదిరిపోయిందని.. శంకర్ సార్.. ఇది ఖచ్చితంగా హలీవుడ్ స్థాయి సినిమా అని, మీకోసం హాలీవుడ్ వెయిట్ చేస్తుందని, రజనీకాంత్, అమీజాక్సన్ సూపర్బ్ పెర్ఫామెన్స్ ఇచ్చారని, 2.0 చిత్రంలో వీఎఫ్‌ఎక్స్ గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నాయని, ప్రేక్షకులకు ఇదో కొత్త అనుభూతి అని.. అంద‌రు ఊహించిన‌దానికి మించి 2.0 బ్లాక్ బస్టర్ మూవీ అని ప్రేక్ష‌కులు తేల్చిప‌డేశారు.