రివ్యూ : 2.0

Thursday, November 29th, 2018, 01:45:58 PM IST

 

సూపర్ స్టార్ రజినీకాంత్ – క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 2.0. రోబో కి సీక్వెల్ గా వస్తున్న ఈచిత్రం ఫై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ రోజు విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ :

ప్రజల సెల్ ఫోన్స్ మాయమవ్వడం తో ఈ చిత్రం స్టార్ట్ అవుతుంది. ఆసెల్ ఫోన్స్ అన్ని కలిసి ఒక పక్షి ఆకారంలో మారతాయి. ఇక ఈ పరిస్థితిని అదుపు చేయడానికి సైంటిస్ట్ వశీకరన్ (రజినీ కాంత్ ) ప్రభుత్వం అనుమతితో చిట్టి ని రీ లాంచ్ చేస్తాడు. అసలు ఈ ఫోన్స్ ఎందుకు కనిపించకుండా పోతాయి ? దీని వెనకాల ఎవరు వున్నారు ? చిట్టి ఈ పరిస్థితి ని ఎలా అదుపులోకి తీసుకువస్తుంది ? అనేదే మిగితా కథ.

విశ్లేషణ :

ఈచిత్రంలో వశీకరన్ పాత్రలో నటించిన సూపర్ స్టార్ రజినీ కాంత్ నటన అలాగే చిట్టి పాత్రలో ఆయన హావ భావాలు బాగున్నాయి. రజినీ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని శంకర్ తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అటు పక్షి రాజన్ గా అలాగే కామన్ మ్యాన్ గా అద్భుతమైన నటన ను కనబరిచారు. వెన్నెల రోబోట్ గా అమీ జాక్సన్ నటన ఆకట్టుకుంటుంది.

ఇక దర్శకుడి శంకర్ విషయానికి వస్తే సెల్ ఫోన్ వాడకం జీవ రాశుల మరణానికి ఎలా కారణం అవుతుంది అనేపాయింట్ తో ఈ కథను రాసుకున్న దర్శకుడు శంకర్ దాన్ని అంతే గ్రిప్పింగ్ తో తెర మీదకు తీసుకురాలేకపోయాడు. ఇక ఈచిత్రం యొక్క గ్రాఫిక్స్ క్వాలీటి కూడా అంచనాలను అందుకోలేకపోయింది . కానీ ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి వారి ఇమేజ్ తగ్గట్లుగా కథ నడిపడంలో శంకర్ విజయం సాధించాడు.

ప్లస్ పాయింట్స్ :

అక్షయ్ కుమార్

చిట్టి – అక్షయ్ కుమార్ ల మధ్య వచ్చే సన్నివేశాలు

క్లైమాక్స్ ఎపిసోడ్

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్ :

వీఎఫ్ఎక్స్ & 3డి గ్రాఫిక్స్

కమర్షియల్ అంశాలు లేకపోవడం

సెకండ్ హాఫ్

రజినీ మార్క్ స్టైల్

తీర్పు :

సోషల్ మెసేజ్ తో ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ 2.0 పర్వాలేదనిపించింది. శంకర్ తీసుకున్న పాయింట్ బాగుంది కానీ దాన్ని గ్రిప్పింగ్ లేని నరేషన్ తో తెరకెక్కించిన విధానం సినిమా ఫలితం ఫై ప్రభావం చూపించింది. చివరగా సైంటిఫిక్ చిత్రాలను ఇష్ట పడే వారికీ ఈ చిత్రం నచ్చుతుంది కానీ రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలను ఇష్టపడే వారికీ ఈ చిత్రం అంతగా కనెక్ట్ కాకపోవచ్చు.

Rating : 3/5