హిట్టా ఫట్టా : 2.0 – శంక‌ర్ మ‌రో ప్ర‌పంచానికి తీసుకెళ్ళాడా..?

Thursday, November 29th, 2018, 05:00:35 PM IST

సౌత్ సినిమా ఇండ‌స్ట్రీ అగ్ర‌ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన‌ శంకర్ అధ్బుత సృష్టి 2.0 సినిమా ఈ రోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ర‌జినీకాంత్, అక్ష‌య్ కుమార్, అమీజాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ దాదాపు 550 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మించింది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజర్, ట్రైలర్‌ల‌తో ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు పెంచేసిన ఈ చిత్రం, రికార్డు స్తాయిలో ప్రీ రిలీజ్ చేసుకుంది. ఈ నేప‌ధ్యంలో తాజాగా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన 2.0 చిత్రం హిట్టా ఫ‌ట్టా తెలుసుకుందాం.

ఇక సినిమాలో అసలు కథ విషయానికి వస్తే.. సినిమా ప్రారంభమే ఓ వ్యక్తి సెల్ టవర్ మీద నుంచి సూసైడ్ చేసుకోవటంతో మొదలవుతుంది. ఆ త‌ర్వాత వ‌రుస‌గా ప్ర‌జ‌ల సెల్‌ఫోన్లు స‌డెన్‌గా మాయ‌మైపోయి..ఆ సెల్ ఫోన్లు అన్ని క‌లిసి ఓ పెద్ద‌ ప‌క్షి ఆకారంలోకి మారి.. నగరంలోకి చొరబడి అన్ని నాశనం చేస్తుంటుంది. ఈ క్ర‌మంలో సెల్‌ఫోన్లు ప‌నిచేయ‌క పోవ‌డంతో ఒక్క‌సారిగా ప్ర‌జాజీవ‌నం స్థ‌బించి అస్త‌వ్య‌స్థ‌మ‌వుతుంది. దీంతో ఈ ప‌రిస్థితి కంట్రోల్ చేసేందుకు సైంటిస్ట్ వ‌శీక‌ర‌న్ ప్ర‌భుత్వ అనుమ‌తితో చిట్టిని రీ లాంచ్ చేస్తాడు. అయితే ఎంతో బ‌ల‌మైన ప‌క్షిరాజుతో చిట్టి ఎలా త‌ప‌ప‌డ్డాడు..చిట్టికి, ఆ ప‌క్షిరాజాకు మ‌ధ్య ఎలాంటి యుద్ధం జ‌రిగింది.. అస‌లు ఈ సెల్‌ఫోన్లు ఎందుకు మాయం అవుతున్నాయి.. దీని వెన‌క ఎవ‌రు ఉన్నారు.. చివ‌ర‌కు వ‌శీక‌ర‌న్‌, చిట్టి క‌లిసి ప‌రిస్థితి ఎలా కంట్రోల్ చేశార‌న్న‌దే ఈ సినిమా క‌థ‌.

ఇక సామాజిక సమస్యను తీసుకుని, దానికి సాంకేతిక హంగులు అద్ది.. త‌నదైన శైలిలో సినిమా తీసి ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చెయ్యడంలో శంకర్‌ను మించిన మాస్ట‌ర్ డైరెక్ట‌ర్ లేర‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో మ‌రోసారి 2.0తో అలాంటి ప్ర‌య‌త్న‌మే చేశారు శంక‌ర్. ప్ర‌స్తుత డిజిటల్ యుగంలో సెల్ ఫోన్ వాడ‌కం మితిమీరిన త‌రుణంలో, ఆ సెల్‌ఫోన్ రేడీయేషన్ వల్ల ప్ర‌కృతిలో ఇత‌ర జీవుల‌కు ఎలాంటి హాని జ‌రుగుతుంది.. అలాగే సెల్‌ఫోన్ రేడియేష‌న్ వ‌ల్ల భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు, వాటి పర్యావసానాలు ఎలా ఉంటాయి అన్న కోణంలో కధను రాసుకున్న ద‌ర్శ‌కుడు శంకర్, ఆ క‌థ‌కు త‌గ్గ‌ట్టు స్క్రీన్‌ప్లేతో పాటు వీ.ఎఫ్.ఎక్స్ టచ్ ఇచ్చి తాను అనుకున్న ఆలోచననే తెరపై ఆవిష్కరించాడు. భారీ బడ్జెట్ పెట్టి తీసిన ఈ వీ.ఎఫ్.ఎక్స్ ఎఫెక్ట్స్ సినిమాలో కొన్ని చోట్ల బ్రహ్మాండంగా ఉండి.. వావ్ అనిపించగా, కొన్ని చోట్ల మాత్రం మరీ డీలా పడిపోయి పిల్లలు చూసే కార్టూన్ నెట్‌వర్క్ కామెడీ సీన్స్‌లా అనిపిస్తాయి.

ర‌జినీకాంత్ ఈ సినిమాలో వ‌శీక‌ర‌న్‌, చిట్టి పాత్ర‌ల్లో త‌న‌దైన స్టైల్‌తో రెచ్చిపోయారు. మ‌రోవైపు అక్ష‌య్‌కుమార్‌ను అటు ప‌క్షిరాజాగా, ఇటు కామ‌న్‌మ్యాన్‌గా ద‌ర్శ‌కుడు తీర్చిదిద్దిన తీరు అద్భుతం అని చెప్పాలి. రోబోతో పోలిస్తే 2.0లో పాటలు పెద్దగా ఆసక్తికరంగా లేవు.. అయితే రెహ‌మాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రం హైలెట్ అని చెప్పాలి. అమీజాక్స‌న్ పాత్ర‌ను స‌రిగ్గా డిజైన్ చేయ‌లేదు శంక‌ర్. ఆమె పాత్ర నివిడి కూడా త‌క్కువ‌గా ఉంది. ఇక సాంకేతికంగా ఉన్న‌తంగా ఉన్న ఈ చిత్రం.. విజువ‌ల్ ఎఫెక్ట్స్ మ‌రీ హాలీవుడ్ స్థాయిలో లేవు గానీ… మ‌న తెలుగు ప్రేక్ష‌కుల్ని మాత్రం అబ్బుర‌ప‌రిచే విధంగా ఉన్నాయి. త్రీడీలో చూడ‌గ‌లిగితే ఆ ఎఫెక్ట్స్ మ‌రింత బాగుంటాయి. సెల్‌ఫోన్ల‌కు మ‌నిషి ఎలా ఎడిక్ట్ అవుతున్నాడు.. దాని వ‌ల్ల ముందు ముందు ఎలాంటి ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌నే లైన్‌తో క‌థ అల్లుకున్న శంక‌ర్ వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేశాడు. అయితే రోబో మాదిరి ర‌జినీ స్టైట్ ఇక్క‌డ మిస్స‌వ‌డం, విఎఫ్ఎక్స్ అక్క‌డక్క‌డ‌ తేలిపోవ‌డం, సెకండ్‌హాఫ్‌లో క‌థ‌నం స్లో అవ‌డం ఈ చిత్రానికి కొంత మైన‌స్ అయినా.. చివ‌రికి శంకర్ తాను ఏదైతే తీయాలని అనుకున్నాడో, దాన్ని స్పష్టంగానే తెర‌పై ప్రెజెంట్ చేసి సక్సెస్ కొట్టాడు అని చెప్పవచ్చు. ఇక క్లైమాక్స్‌లో సూపర్ ట‌చ్ ఇచ్చాడు శంక‌ర్ రోబో 3.0 అంటూ ఒక మైక్రో రోబో రూపంలో రజనీ స్టైల్ మ్యాన‌రిజంతో వ‌చ్చిన సీన్ సినిమాను పీక్స్‌కి తీసుకెళ్లిందని చెప్పాలి. ఇక ఫైన‌ల్‌గా చెప్పాలంటే ర‌జినీ-శంక‌ర్‌ల కాంబో సూప‌ర్ హిట్ అని మ‌రోసారి 2.0 నిరూపించింది. మ‌రి బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

123telugu.com Rating : 3.75/5 – అద్భుత విజువల్ థ్రిల్లర్

greatandhra.com Rating : 3.25/5 – శంకర్‌ – 2.0

idlebrain.com  Rating : 3.25/5 –  Good vs good

indiaglitz.com Rating : 3/5 – 2.0 రీలోడెడ్ వెర్ష‌న్ సాంకేతికంగా ఓకే కానీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే అంశాలు త‌క్కువే.

tupaki.com Rating : 2.75/5 – టెక్నికల్లీ బ్రిలియంట్ – ఎమోషన్స్ వీక్

gulte.com  Rating : 3025/5  – 2.0 – Giant size entertainment! 

cinejosh.com Rating : 3/5 – శంకర్ మరో అద్భుత సృష్టి.What did you think of ‘2.o'( ‘2.o’ సినిమాపై మీ అభిప్రాయం ఏమిటి)?