మూవీ రివ్యూ : 118

Saturday, March 2nd, 2019, 03:50:41 AM IST

నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే హీరోయిన్ గా నివేతా థామస్ కీలక పాత్రలో కే వి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 118. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆసక్తిని పెంచిన ఈ చిత్రం ట్రైలర్ తో ఆ ఆసక్తిని అంచనాలుగా మార్చేసింది.సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ సినిమా ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ :

కథలోకి వెళ్లినట్టయితే హీరో కళ్యాణ్ రామ్(గౌతమ్)కి తరచూ ఒక కల వస్తుంది.అందులో నివేతా థామస్(ఆద్య) కొన్ని ఆసక్తికర పరిమాణాల వలన కనిపించకుండాపోయినట్టు కల వస్తుంది.గౌతమ్ కు వచ్చిన ఈ కలలో కనిపించిన ఈ ఆధ్య ఎవరు? ఈమె నిజ జీవితంలో కూడా మిస్సయ్యిందా..? అసలు ఈ 118 టైటిల్ వెనుకున్న రహస్యం ఏమిటి? ఈమె కనిపించకుండా పోయిన ఈ మిస్టరీని గౌతమ్ చేధించగలిగాడా? ఆ సమయంలో ఎదురైన సమస్యలను గౌతమ్ ఎలా పరిష్కరించి ఆద్య ను కనుక్కున్నాడో లేదో తెలియాలంటే ఈ సినిమాను వెండి తెరపై మిస్సవ్వకుండా చూడాల్సిందే..

విశ్లేషణ :

ముందుగా ఈ సినిమా విషయంలో కళ్యాణ్ రామ్ తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకొనే తీరాలి.ఇంతకు ముందు కళ్యాణ్ రామ్ చేసిన రొటీన్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉందని ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఫీలవుతారు.ఇక కళ్యాణ్ రామ్ నటన విషయానికి వస్తే నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో నటన గురించి వేరే చెప్పక్కర్లేదు..ఏ పాత్ర అయినా అందుకు తగ్గట్టుగానే కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాలో అద్భుత నటన కనబర్చారు.ఒక జర్నలిస్ట్ గా ఇనెప్స్టిగేషన్ చేసే సీన్లు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతాయి.

అలాగే కథానుసారం వచ్చే ట్విస్టులు కూడా ప్రేక్షకుడిని మెప్పిస్తాయి.ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ అలాగే కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్లు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.ఇక ఇతర నటీనటుల విషయానికి వస్తే హీరోయిన్ గా కనిపించిన షాలిని పాండే తన పాత్రకి పూర్తి న్యాయం చేకూర్చారు.అలాగే కీ రోల్ లో కనిపించిన నివేత థామస్ మరోసారి తన అద్భుత నటనతో ఆకట్టుకుంటుంది.అలాగే మరో ముఖ్య పాత్రలో కనిపించిన హరితేజ కూడా మంచి నటన కనబర్చారు.అలాగే నాజర్ తదితరులు వారి పాత్రలకు తగ్గ న్యాయం చేకూర్చారు.

ఇక దర్శకుని పనితనంకి వచ్చినట్టయితే ఇప్పటికే ఎన్నో సినిమాలకి సినిమాటోగ్రఫీ అందించిన కే వి గుహన్ ఈ చిత్రానికి మొట్టమొదటి సారిగా దర్శకత్వం వహించినా ఈ సినిమా కోసం ఆయన ఎంచుకున్న కాన్సెప్ట్ మరియు ఈ సినిమాని నడిపించిన తీరుని మెచ్చుకోవాల్సిందే..అక్కడక్కడా కొన్ని చోట్ల డల్ నరేషన్ ఉన్నట్టు అనిపించినా ఓవరాల్ గా మాత్రం సినిమా మంచి ఆసక్తికరంగా సాగుతుంది.

ఈ సినిమాలో హీరోయిన్ షాలిని పాండే అయినా సరే కీలక పాత్ర అయినటువంటి నివేతా థామస్ చుట్టూనే తిరుగుతుంది.ఈ విషయంలో దర్శకుడు కొంచెం ఆలోచించి ఉంటే బాగుండేది.కాకపోతే నివేతా థామస్ విషయంలో ఎంచుకున్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పార్ట్ మాత్రం ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలని రెగ్యూలర్ గా చూసే ఆడియెన్స్ కి అయితే మామూలుగానే అనిపిస్తుంది.అలాగే శేఖర్ చంద్ర అందించిన సంగీతం మరియు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది.

ప్లస్ పాయింట్స్ :

సినిమా కాన్సెప్ట్

ఇంటర్వెల్ బ్లాక్

కథానుసారం సాగే సస్పెన్స్

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడా డల్ అనిపించే నరేషన్

రెగ్యులర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్

తీర్పు :

ఫైన‌ల్‌గా చెప్పాలంటే 118 మూవీ టిక్కెట్ కొనుక్కుని థియేట‌ర్‌కు వ‌చ్చిన ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేయ‌డం గ్యారెంటీ అని చెప్పాలి. థ్రిల్లింగ్ స‌బ్జెట్‌కు త‌గ్గ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సినిమా అదిరిపోయింది. అలాగే సన్నివేశాల‌కు త‌గ్గ‌ట్టు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప‌ర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. క‌ళ్యాణ్ రామ్, నివేద థామ‌స్‌ల న‌ట‌న ఆక‌ట్టుకంది. గుహ‌న్ ఛాయాగ్ర‌హ‌నం ఈ సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్ళింది. చివ‌రిగా చెప్పాలంటే 118 డీసెంట్ థ్రిల్ల‌ర్.. కానీ కొన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు సెకండ్‌హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది.. మ‌రి బాక్సాఫీస్ ప‌రంగా 118 రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

 

 

Rating : 3.5/5